Tag: వ్యాసరచన పోటీ

  • వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతల వివరములు

    తెలుగుబాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక వ్యాసము వ్రాసి పంపమని చేసిన మా విజ్ఞప్తికి స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా 70 పాఠశాలల నుండి 475 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.

    పాఠశాల యాజమాన్యానికి మా కృతజ్ఞతలు

    మా విజ్ఞప్తి మేరకు, యాజమాన్యం వారు, వారి పాఠశాల స్థాయిలో వ్యాసరచన పోటీని నిర్వహించి, వాటిలో నుండి కొన్ని ఉత్తమమైన ప్రతులను మాకు తపాలా మరియు ఇ-మెయిల్ ద్వారా పంపటం జరిగింది.

    పాల్గొన్న విద్యార్థులకు మా అభినంధనలు

    విద్యార్థులు అందరూ ఎంతో ఉత్సాహంగా, ఎన్నోమంచి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్ లో ఎన్నో వెబ్సైట్లు, బ్లాగులను సందర్శించి, ఆ పైన ఆ విషయాలను ఒక పద్దతి ప్రకారం అమర్చి, ఎంతో అంధంగా వ్రాసి మాకు పంపినందుకు మా హృదయపూర్వక ధన్యవాధములు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు, వారంధరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు.

    అధ్బుతమైన స్పంధన:

    మేము ఊహించిన దానికంటే చాలా మంచి స్పంధన లభించింది. మేము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఎంతో మంది మాకు ప్రత్యేకంగా లేఖ వ్రాయటం జరిగింది. ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించే విషయం. భవిష్యత్తులో మేము చేపట్టబోయే ఎన్నో కార్యక్రమాలకు ఇది తొలి విజయంగా భావిస్తున్నాము. మీ ఈ ఆదరాభిమానములు, ఆశీర్వచనములు, సహకారములు మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.

    విద్యార్థుల ఎంపిక

    మాకు అందిన ప్రతి వ్యాసాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని వ్యాసాలను ఎంపిక చేయటం జరిగింది. గెలుపొందని విద్యార్థులు దీన్ని ఒక పరాజయంగా బావించవద్దని మనవి. ప్రతి విద్యార్థి ఎంతో బాగా వ్రాయటం జరిగింది. అయితే వ్రాసిన విధానం, విషయాన్నివర్ణించిన తీరు, స్పష్టీకరించిన విధానం, భావ వ్యక్తీకరణ, వ్యాకరణ శుద్ది మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఉత్తమమైన వ్యాసములను ఎంపిక చేయటం జరిగింది. గెలుపొందిన వ్యాసముల కంటే గొప్పగా వ్రాసిన వ్యాసములు ఎన్నో ఉన్నాయి. అయితే, వారు చేసిన కొన్ని తప్పులు వారిని వెనుక స్థానంలో నిలబెట్టాయి.

    బహుమతి ప్రధానం

    మేము ముందుగా ప్రకటించిన ప్రకారం, ప్రధమ,  ధ్వితీయ మరియు తృతీయ స్థానములకు బహుమతులు అందజేయటం జరుగుతుంధి. అలానే, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 100 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయబడుతాయి. బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు తెలుగు బాషాధినోత్సవమైన ఆగష్టు 29న మీ పాఠశాలలో అందజేసే విధంగా ఏర్పాటు చేస్తాము.

    ప్రత్యేక బహుమతులు:

    ముందుగా ప్రకటించకపోయినా, విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి మేము కొన్ని ప్రత్యేక బహుమతులను  ఇవ్వదలచినాము. అందుకోసం, ఉత్తమమైన ప్రతిభ కనబరచిన పదిమంది విధ్యార్థులను ఎంపిక చేయటం జరిగింధి.

    గెలుపొందిన విధ్యార్థుల వివరములు.

    ప్రథమ బహుమతి: కూన రసజ్ఞ, 10వ తరగతి, శ్రీ సరస్వతి జ్ఞాన మందిర్ ఉన్నత పాఠశాల, బుధవార్ పేట్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా.

    వీరికి 1000 రూపాయల నగధు బహుమతి మరియు ప్రశంసాపత్రం అంధజేయటం జరుగుతుంది.

    ధ్వితీయ బహుమతి: అల్లుమంగ, 10వ తరగతి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద నందిపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా.

    వీరికి 500 రూపాయల నగధు బహుమతి మరియు ప్రశంసాపత్రం అంధజేయటం జరుగుతుంది.

    తృతీయ బహుమతి:

    ౧. ఎమ్. పౌష్య, 10వ తరగతి, విజ్ఞాన్ హై స్కూల్, ఎల్‌ఐ‌సి కాలనీ, గుంటూరు, గుంటూరు జిల్లా.

    ౨. కె. ఐశ్వర్య, 6వ తరగతి, సాధు వశ్వని ఇంటర్నేషనల్ స్కూల్, జయభేరి పార్క్, కొంపల్లి, హైదరాబాద్.

    వీరిరువురికీ 250 రూపాయల నగధు బహుమతి మరియు ప్రశంసాపత్రం అంధజేయటం జరుగుతుంది.

    ప్రత్యేక బహుమతులు:

     వి.తిరుపతిరావు, 10వ తరగతి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజుపాలెం, గుంటూరు జిల్లా.

    ౨. ఎస్‌.రూతమ్మ, 9వ తరగతి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, జడిమల్కాపూర్, మెధక్ జిల్లా.

    ౩. బి.నర్మధ, 10వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చీమకుర్తి, ప్రకాశం జిల్లా

    ౪. బి.వి. పుష్ప విహారి, 9వ తరగతి, గురుకుల విధ్యాపీఠ్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.

    ౫. డి. రవీంద్రనాథ్, కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్, బాలాజీ కాంప్లెక్స్, నంధ్యాల, కర్నూల్ జిల్లా

    ౬. టి.మధుసూదన్, 10వ తరగతి, భారతీయ విధ్యమందిర్, మంజీరా నగర్, సంగారెడ్డి, మెధక్ జిల్లా

    ౭. ఎస్‌.గణేష్, 10వ తరగతి, క్యాథరీన్ పబ్లిక్ స్కూల్, భీమిలి పట్నం, విశాఖపట్నం (జిల్లా).

    ౮. ఆర్. రచన, 9వ తరగతి, యస్.ఆర్. స్కూల్, కాకాజీ కాలనీ, విజయ టాకీస్ రోడ్, హన్మకొండ, వరంగల్ జిల్లా.

    ౯. జూభేరియయా బేగం, 8వ తరగతి, యస్.ఆర్. నేషనల్ హై స్కూల్, అడ్వోకేట్ కాలనీ, వరంగల్.

    ౧౦. బి. వరుణ్, నిర్మల్ హృదయ్ హై స్కూల్, ఎన్‌ఎస్‌సి కాలనీ, ఖమ్మం.

      వీరందరికీ ఒక మంచి పుస్తకం మరియు ప్రశంసాపత్రం బహుమతిగా అందజేయటం జరుగుతుంది.

     ఉత్తమమైన ప్రతిభ కనబరచిన విద్యార్థులు.

    వీరందరికీ ప్రశంసాపత్రం బహుమతిగా అందజేయటం జరుగుతుంది.